Viral2022 : నేటి ట్రెండ్ కి తగ్గట్టు ప్రేమించిన అమ్మాయికి విభిన్న స్టైల్ లో ప్రేమను వ్యక్త పరచడం సాధారణమైపోయింది. కొందరైతే తమ ప్రేమ జీవితాంతం గుర్తుండిపోయేలా వినూత్న రీతిలో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ముఖ్యంగా క్రీడాకారులు తమ గర్ల్ ఫ్రెండ్స్ కి సర్ ప్రైజ్ చేస్తూ స్టేడియంలోనే ప్రపోజ్ చేసిన సీన్స్ సోషల్ మీడియాలో చాలానే చూసుంటాం. ఈక్రమంలోనే ఓ అథ్లెట్ తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. ఆ అథ్లెట్ ప్రపోజల్ తో ప్రేయసితో పాటు నెటిజన్స్ హృదయాలను గెలుచుకున్నాడు.
View this post on Instagram
కాగా వీడియో గమనించినట్లయితే..మ్యాచ్ ముగిసిన అనంతరం అథ్లెట్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి గట్టిగా హాగ్ చేసుకున్నాడు. వెంటనే మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసేందుకు రింగ్ తీశాడు. ఇంతలో అతని కాలి కండరాలు పట్టేయడంతో కుప్పకూలిపోయాడు. ఆతర్వాత సిబ్బంది సాయంతో ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయడం ఆమె అంగీకరించడం జరిగిపోయింది .ఈవీడియో ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఈవీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. తిమ్మిరి వలన కాలు పట్టేసిన అతడు ప్రేమను గెలుచుకున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఎన్ని అవంతారాలు ఎదురైనా ప్రేమికులు గెలుస్తారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఈవీడియోకు ఇన్ స్టాగ్రామ్ లో లక్షల లైక్స్ తో పాటు 3.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.