తెలంగాణలో బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ ని చూసి.. ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరాడు. దీంతో సంజయ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు కోరిక తీర్చాడు. అనంతరం పాదయాత్రగా ఐలాపూర్ గ్రామంలోకి ప్రవేశించగానే..స్థానిక నేతలు, కార్యకర్తలు సంజయ్ కి ఘన స్వాగతం పలికారు.