నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

అర్జున పురస్కార గ్రహీత నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ కాంగ్రెస్ సన్మానించింది. అనంతరం 5 లక్షల రూపాయలను క్రీడాకారిణికి బహుమతిగా అందించారు. అప్పుడు సానియా మీర్జా.. ఇప్పుడు నిఖత్ చొరవచూపి క్రీడలల్లో రాణించడం అభినందనీయమన్నారు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాబోయే ఒలింపిక్ క్రీడలల్లో కూడా నిఖత్ విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో నిఖత్ … స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించి.. నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారం కూడా ప్రభుత్వమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. DSPగా ఉద్యోగం ఇవ్వాలన్న నిఖత్ ప్రతిపాధనను వెంటనే పరిశీలించి ఈ నెల 26లోపు నియామక ఉత్తర్వులు జారీచేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.