తెలంగాణ నయగారా జలపాతం అందాలకు ఫిదా..

వర్షకాలం పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తోంది. ఎడతెరపిలేని వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రకృతి ప్రేమికులు సందండి చేయడం పరిపాటి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కుటుంబతో సహా వెళ్లి సేదతీరేందుకు అనువైన ప్రదేశంలో ఒకటిగా చెప్పవచ్చు.

ములుగజిల్లా వాజేడులోని బోగతా జలపాతాన్ని తెలంగాణ నయగరా జలపాతంగా పేరుంది. పాలపొంగులాటి జలపాతం అందాలను చూడటానికి వర్షకాలంలో పర్యటాకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడి సుందర దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లదాన్ని కలిగిస్తాయి.

 

బోగతా జలపాతం దగ్గర్లో నరసింహాస్వామి ఆలయం కూడా ఉంది. ప్రతీ ఆదివారం వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఆధ్మాత్మిక, ఆహ్లాద శోభతో బోగతా జలపాతం వెలిగిపోతోంది.

బోగతా జలపాతం చూడాలంటే.. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు వెళ్లాలి. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడ్నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్లే బొగత జలపాతం వస్తుంది. ఖమ్మం నుంచి వెళ్లాలంటే 240 కిలోమీటర్లు.. హైదరాబాద్ 440 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

బోగత జలపాతం దగ్గర్లో ఉన్నటువంటి మరో జలపాతం కొంగళ . ఈజలపాతాన్ని చేరుకోవాలంటే వరంగల్ నుండి 2 గంటల దూరం.. బొగత జలపాతం నుండి 10 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ జలపాతాన్ని స్థానికులు ‘వి-ఫాల్’ అని పిలుస్తారు. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం అందాలు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Optimized by Optimole