గవర్నర్ ఎట్ హోం వేడుకకు కేసీఆర్ దూరం.. వస్తానని రాలేదన్న గవర్నర్!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.  ఎట్ హోమ్ కార్యక్రమానికి రావాలని చీఫ్ జస్టిస్ , సీఎం కేసీఆర్ కు పర్సనల్ గా లెటర్ రాసినట్లు.. మొదట వేడుకకు సీఎం కేసీఆర్ వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని.. అరగంట వేచిచూసి ప్రోగ్రాం ప్రారంభిచినట్లు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇక ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరయ్యారు. పలు పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఈవేడుకకు హాజరుకాకపోవడం గమన్హారం.

కాగా సీఎం కేసీఆర్ రాకపోవడంపై గవర్నర్ తమిళి సై స్పందించారు.సీఎం కేసీఆర్ సాయంత్రం 6.50కి కార్యక్రమానికి వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందన్నారు. తాను, హైకోర్టు సీజే సీఎం కోసం అరగంట వెయిట్ చేసినట్లు .. వారు రాకపోవడంతో ప్రోగ్రాం ప్రారంభిచినట్లు గవర్నర్ తెలిపారు. అయితే కేసీఆర్ ఎందుకు రాలేదో వివరాలు తెలియరాలేదన్నారు.

గతంలోనూ సీఎం కేసీఆర్ , గవర్నర్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆతర్వాత రాజ్ భవన్ లో జరిగిన ఓ వేడుకకు కేసీఆర్ హాజరవడంతో పరిస్థితి చక్కబడినట్లు కనిపించింది. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలు,వరద ముంప్పు ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించడంతో.. ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.