నాగచైతన్య నటించిన తాజాచిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో థ్యాంక్యూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈమూవీ అంచనాలు అందుకుందా లేదా చూద్దాం!
కథ : అందరిలాగానే జీవితంలో ఎదగాలన్న కోరిక ఉన్న కుర్రాడు అభిరామ్(నాగచైతన్య).పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదన్న తరహాలో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈక్రమంలోనే ప్రియ(రాశిఖన్నా) పరిచయం ఏర్పడి నచ్చడంతో..ఇద్దరూ కలిసి డేటింగ్ (సహజీవనం) చేస్తారు. రాజీపడని అభిరామ్ మనసత్వం ఆమె నచ్చకపోవడంతో..అతని జీవితంలో వెళ్లిపోతోంది. ఆతర్వాత అభిరామ్ పరిస్థితి ఏంటి? అతడి ఆలోచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రియ అతనికి శాశ్వతంగా దూరమైందా? ఏంజరిగిందన్నది తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందే!
పనితీరు…
కథ రోటిన్ అయినప్పటికీ.. కొత్త హంగులు అద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు విక్రమ్ కుమార్. అభిరామ్, ప్రియ మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. జీవితంలో అభిరామ్ ఎదుగదల సన్నివేశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. పార్వతి (మాళవిక), అభిరామ్ జోడి చూడముచ్చటగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ సోసో అనిపించినప్పటికి.. సెకాండఫ్ ఫర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి.
ఇక నటన పరంగా నాగచైతన్యకు నూటికి నూరు మార్కులు వేయెచ్చు. మూడూ వైవిధ్యమైన పాత్రలను తనదైన యాక్టింగ్ తో మెప్పించాడు. రాశి, మాళవిక ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. అవికాగోర్ ఇలా వచ్చి అలా వెళ్లిన తన పాత్ర పరిధిమేరకు నటించింది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అద్భుతం అనిచెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటల ఓమెస్తారుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు.
‘థాంక్యూ ‘విలువ గొప్పదనాన్ని తెలిపేందుకు విక్రమ్ కుమార్ చేసిన ప్రయత్నం బాగుందని చెప్పాలి. రోటిన్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చకపోయినా.. ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది.