Telugupoetry: పువ్వులూ ‘ మనిషీ ‘…

Poetry:

పువ్వులు మట్టి మశానాల
పోషకాలతో పూస్తాయి.
వాటి మొక్కలకు అందే నీళ్లు
కొన్ని మురికిగా, కొన్ని స్వచ్ఛంగా ఉంటాయి.
అయినా పువ్వులు పవిత్రమైనవి,
అందమైనవి, సుగంధభరితమైనవి.
వాటి రంగులు కళ్లకు ఇంపుగా,
మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి.

ఇక మనిషి-

పువ్వుల అందాలను చూస్తూ

కన్నీళ్ల కన్నా స్వచ్ఛమైన నీళ్లు తాగుతాడు.
ఎర్రెర్రని యాపిల్‌ పండ్లను కొరుక్కు తింటాడు.
అయినా అసహ్యంగా తయారవుతాడు.
ఎందుకలా?

పాష్తో మూలం: పీర్‌ మహమ్మద్‌ కార్వాన్‌
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

 

Optimized by Optimole