Panyala jagannathdas:
నిశ్శబ్దం..
రాత్రి తెరలను దించిన చేయి
కాంతిని నిశితంగా చూస్తూ
పకాలుమని నవ్వుతోంది.
సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి?
పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు.
చీకటి కనుగుడ్లను
చీల్చుకుని దూసుకెళ్లిన బాణం
ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది.
కిటికీకి ఆవల
రాత్రి తెర మీద ఒక ఉల్క
నెమ్మదిగా పాకుతోంది.
—
కజక్ మూలం: అర్దక్ నుర్గాజ్
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు