హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!

Nancharaiah merugumala senior journalist:

‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ  సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట!

‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా త్రిపాఠీ అవేదనతో ఇటీవల చెప్పిన మాటలివి. ఈ నెల 10న వెలువడిన కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రత్యక్ష ప్రసారమైన ఒక చర్చా కార్యక్రమంలో ఈ ఎన్నికల్లో మురికి కుల రాజకీయాల వల్లనే బీజేపీ ఓడిపోయిందంటూ సందర్భం, అవసరం లేకుండా ఆమె ఇలా మాట్లాడడంపై స్వరాజ్‌ ఇండియా నాయకుడు, రాజకీయ–ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ నొచ్చుకుంటూæ నిన్న ‘ద ప్రింట్‌’లో ఓ వ్యాసం రాశారు. హిందీ జర్నలిజంలో ప్రధానంగా టీవీ పాత్రికేయంలో అగ్ర కులాలు ముఖ్యంగా బ్రాహ్మణ జర్నలిస్టుల సంఖ్య ఎక్కువ అని ఆయన తెలిపారు. మూడు శాతం జనాభా ఉన్న భారతంలో హిందీ జర్నలిజంలో బ్రాహ్మణ ఆధిపత్యం, భావజాలం మితిమీరిపోయిందని ఆయన వివరించారు. ఈ విషయాన్నే ప్రసిద్ధ హిందీ–ఇంగ్లిష్‌ బ్రాహ్మణ జర్నలిస్టు మృణాల్‌ పాండే కూడా అనేకసార్లు చర్చించారు. ఇంగ్లిష్‌ చానల్స్‌తో పోల్చితే హిందీ టీవీ న్యూజ్‌ చానల్స్‌ లో హిందూ అగ్రవర్ణ ఆధిపత్యం, కుల అహంకారంతో కూడిన మాటలు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో బ్రాహ్మణులకు పూర్వమున్న సంపూర్ణాధిపత్యం ఇప్పుడు లేదనే విషయాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా నేడు హిందీ చానల్ప్‌లో బ్రాహ్మణ యాంకర్లు చెబుతున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ కాలం నాటి కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యం కొనసాగిన రోజుల్లో రాజకీయ పదవుల్లో బ్రాహ్మణుల సంఖ్య అత్యధికంగా ఉన్న మాట నిజమే కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హిందీ మహిళా జర్నలిస్టులు సైతం వాపోవడం సబబుగా కనిపించడం లేదు.

భారతదేశంలో కాంగ్రెస్‌ ఏకైక ఆధిపత్య పార్టీ (ఒన్‌ డామినెంట్‌ పార్టీ)గా కొనసాగిన 1950లె, 60లు, 70, 80ల్లో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, చట్టసభల సభ్యుల్లో అత్యధికంగా బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన రాజకీయ నాయకులు ఉన్న మాట నిజమేగాని మారిన పరిస్థితులను ఈ యాంకర్లు గుర్తించడం లేదు. బ్రాహ్మణ–బనియా పార్టీగా ముద్రపడిన బీజేపీ పరిపాలన 9 సంవత్సరాలు గడిచాక కూడా పూర్వపు బ్రాహ్మణాధిపత్య రాజకీయాలు హిందీ రాష్ట్రాల్లో తిరిగి రాకపోవడం ఈ బ్రాహ్మణ హిందీ జర్నలిస్టుల గుండెల్లో అంతులేని బాధ కలిగిస్తోంది. మంటలు రేపుతోంది. నరేంద్ర మోదీ పోయి అటల్‌ బిహారీ వాజపేయి వంటి బ్రాహ్మణ ప్రధాని ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న ఈ జర్నలిస్టుల ఆశలు ఎన్నటికి ఫలిస్తాయో మరి.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole