ప్రజాధనం ఎత్తుల్లో బరువుల్లో తూచడం వెనక ప్రజా ప్రయోజనాల కన్నా పాలక కుల ప్రయోజనాలే ముఖ్యం ..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మేధావులు, కవులు, రచయితల నుంచి భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పెద్దలు గుర్రం సీతారాములు గారు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చదివేయండి.

Gurramseetaramulu: ప్రపంచం  మొత్తం కరోనా పీడితమై చిక్కిశల్యం అవుతున్న కాలంలోనే ఈదేశం నర్మదానది ఒడ్డున ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అప్పు చేసి మరీ నిర్మించుకుంది. జస్ట్ మూడు వేల కోట్ల తో నిర్మించిన ఆ  బొమ్మకు సింపుల్ గా డెబ్భై వేల టన్నుల సిమెంట్, పాతిక వేల టన్నుల ఉక్కు,పన్నెండు వేల టన్నుల ఇత్తడి తడకలు అమర్చుకున్న ఈ విగ్రహం పేరుకి యూనిటీనే కానీ యూనిటీని కాదన్న వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కబరస్తాన్ కు పంపేంత ఉన్మాధపు నిర్మాణం అది. బీదవాడికి మూడెకరాల భూమి ఇస్తా అన్న కెసిఆర్ విశ్వవిద్యాలయాలు పడావు పెట్టి నూటా యాభై కోట్ల పై చిలుకు అంబేద్కర్ విగ్రహం పెట్టి మేథావుల కపుల ప్రశంసకు గురైంది.

విషాదం ఏమిటి అంటే యూనిటీ విగ్రహ దాతకు దేశ అభివృద్ధి పట్టదు. అంబేద్కర్ విగ్రహ దాతకు దళిత బహుజన సంక్షేమం అసలే పట్టదు అనేది జగమెరిగిన సత్యం. ఇక కొందరు కవులు మేథావులు సెల్ఫీ పండగ చేసుకుంటున్నారు. 

ఈ రెండు విగ్రహాలు పెట్టిన ఘనులు పైకి కొట్టుకున్నట్టు కనబడతారు కానీ రూపం లో సారం లో ఒకరికి మరొకరు ఉపయోగ కారులు. ఒకరిని ఒకరు బెదిరించుకుంటారు బుజ్జగించు కుంటారు. కానీ భక్తులు విగ్రహాలు కట్టిన వాళ్ళను మహిమాన్వితులు చేసే పనిలో బిజీగా ఉంటారు. 

బార్త్స్ ఫ్రెంచ్ చింతనాపరుడు. ఎఫ్లూ రోజుల్లో ఇలాంటి ఫ్రెంచ్ చింతనాపరులతో కుస్తీ పట్టడమే నాకు జీవిత వ్యాపకం నిజానికి అవి అర్ధం చేసుకోవడం కష్టం అయ్యేది. ఏళ్ళకు ఏళ్ళు చదివా ఇంకా చదువుతూనే ఉంటా అది వేరే కథ అసలు విషయానికి వస్తే ‘ఇతిహాసాలు’ లేదా ఐతిహ్యాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆవో లిల్లాయి పాటలు లాంటివి అంటాడు బార్త్స్. 

ఈ మాట ఆయన డెబ్బై ఏళ్ళకింద అన్నాడు. ఇప్పుడున్న మార్కెట్ జిగ్ జాగ్ లు అప్పట్లో లేవు. ఈ ఇతిహ్యాలను తయారుచేసే మెకానిజం ఒకటి ఉంటది. 

ఆ మెకానిజాన్ని రాజ్యమే తయారు చేసుకుంటది. అది రామ మందిరం  కావొచ్చు జ్ఞానవాపి కావొచ్చు . పటేల్ ఏక్తా విగ్రహం కావొచ్చు. కేసీఆర్ పెట్టిన అతి పెద్ద అంబెడ్కర్ విగ్రహం కావొచ్చు.

నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే  ‘Myth Is Depoliticized Speech’ అనేది పెద్ద అబద్దం. ఒక ఐతిహ్యం దానికది తయారుకాదు దానివెనక ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి. నా దృష్టిలో ప్రత్యేక తెలంగాణ అనే ఐతిహ్యం కూడా పెద్ద పజిల్. దోపిడీ పీడన అనే మాటల చుట్టూ పేర్చబడిన ఆ అబద్దం ఎన్నికల ను ఎంత అపహాశ్యం చేస్తోందో చూస్తూనే ఉన్నాం.

నిజానికి ఈ కురీపుల కన్నా అంబేద్కర్ ఉన్నతుడు. అతను  ఒక యుగానికి ఎదురీది నడిచాడు. రాబోయో యుగం లో అన్నార్తుల బాధలనూ బాధాసర్ప ద్రస్టులనూ  ఒక సీరియస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ లో దృశ్యమానం చేసాడు. ఆయన లక్ష్యం పెద్దది.

ఆయన వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆ విగ్రహాన్ని ఒక ఐతిహ్యం చేసారు. ఆ ఐతిహ్యాలు నూటా యాభై అడుగుల విగ్రహాల చుట్టూనో ఒక జిల్లాకి పేరు పెట్టడం చుట్టూనో ఒక తక్షణ భావోద్వేగాలను  దాని చుట్టూ ఉన్న మిత్ ను  Depoliticized చేసే పనులనూ  రాజ్యం చేస్తూ ఉంటుంది. రాజ్యం తన అవసరాలకు అనుగుణమైన మిత్ ను తయారు చేసి అడగక ముందే నోటికి తాళ్ళం వేసేపని చేస్తూ ఉంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా నిత్యం జరిగే ప్రక్రియ. వీటిని వేగవంతం చేసే హిట్ మాన్ లూ, తాబెదార్లూ ,బ్యూరోక్రాట్ లూ, మధ్యవర్తుల ముసుగులో అధ్యాపకులూ, కవిసేన కరసేవకులూ ఉంటారు. ఇలా ఒక ఐతిహ్యాన్ని సృష్టించి దాన్ని రాజకీయ అవసరాల చుట్టూ తిప్పడం లో కెసిఆర్ ని మించిన ఘనాపాటి ఈ దేశం లోనే లేడు. తాను తలుచుకుంటే రాళ్ల గుట్ట వజ్రాల మయం అవుద్ది. జ్ఞానాన్ని పంచె విశ్వవిద్యాలయం శంకర గిరి మాన్యం చేయగలడు. ఏక్తా విగ్రహ ఆరాధకులకు అరివీర భక్తుడు అంబేద్కర్ విగ్రహ ప్రదాత. అందుకేనేమో రైతు చట్టాలు, నోట్ల రద్దు, లాంటి ఘోరాతి ఘోరమైన జాతివ్యతిరేక నిర్ణయాలను స్వాగతించి సమర్ధించాడు. పైగా ఆ మిత్ కి దేశవ్యాప్తంగా సమ్మతి కూడగట్టే పనికూడా చేసాడు.

పంజాగుట్ట చౌరస్తా లో సగౌరవంగా ప్రజలు నిలబెట్టుకున్న విగ్రహాన్ని పీకేయగలడు అదే నోటితో  ఇప్పుడు కొత్త అసెంబ్లీ కి అడగని అంబేద్కర్ పేరు పెట్టడం ఇంకా పార్లమెంటు కు కూడా పెట్టాలి అని తీర్మానం చేస్తాడు. 

మోడీ ఒక గిరిజన యవతిని రాష్ట్రపతి ని చేయడం ఒక మిత్ ని బద్దలు కొట్టడం. ఇస్తా అన్న మూడెకరాల భూమి దళిత ముఖ్యమంత్రి వాగ్దానం మట్టి కొట్టుకుని పోతుంది. అయినా ఇలా తక్షణ అవసరాల మీద స్పందించే ఆ స్వల్ప  మార్పుని స్వాగతించే మేధావులను చూస్తే జాలేసింది. 

సమాజం లో ప్రతి అవసరానికీ ఒక మిత్ తయారుచేసి వదలడం ఒక ఆట అయిన సంక్షుభిత కాలంలో కవులు, కళాకారులు, మేధావులూ ఆ మిత్ ను దాటి బయటకురాని తనాన్ని కుట్ర అనుకోవాలి. ఈ కవులు మేధావులూ విమర్శకులూ ఆ మిత్ వండివార్చడం దానికి సమ్మతిని కూడగట్టడం ప్రచారం చేయడం లో ముందుంటారు అనేది విడమర్చి చెపాల్సిన అవసరం లేదు.

ఈ విగ్రహం లో నాకు నచ్చిన అంశం రాజ్యాంగాన్ని సగౌరవంగా పట్టుకున్న అంబేద్కర్ . అదే రాజ్యాంగాన్ని మార్చాలి అన్న నాయకుడు మాటలు జనాలు మర్చిపోవడమే విషాదం. 

(మరీ మూర్ఖంగా విగ్రహాలను తూలనాడడం నా లక్ష్యం కాదు. పైసా పైసా కూడేసి ఊరి చౌరస్తా లో నిలబెట్టుకున్న ఆత్మ గౌరవం పట్ల నాకు గౌరవం . ప్రజాధనం ఇలా ఎత్తుల్లో బరువుల్లో తూచడం వెనక ప్రజా ప్రయోజనాల కన్నా పాలక కుల ప్రయోజనాలే ముఖ్యం అనే ఎరక తో )

 

Optimized by Optimole