భాషా సంస్కృతిని కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.ప్రాచీన సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.భాషను మరిచిపోతే తెలుగు సంస్కృతి కూడా దూరమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని పిలుపునిచ్చారు. 2020 అక్టోబరులో జరిగిన ప్రపంచ తెలుగు సదస్సులోని అంశాలను మేళవించి ‘వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ రూపొందించిన 100వ తెలుగు గ్రంథాన్ని ఆయన అదివారం దిల్లీ నుంచి అంతర్జాలం ద్వారా అవిష్కరించి ప్రసంగించారు. దాన్ని దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేసిన వంగూరి ఫౌండేషన్‌ను అభినందించారు.