నేల విడిచి సామూ చేస్తే తప్పదు ఈ శిక్ష!

శేఖర్ కంభంపాటి జర్నలిస్ట్ నల్లగొండ :  ఎన్నికలు అంటేనే ఓ వైకుంఠపాళీ ఈ గేమ్ లో పాము ఎవరో ? నిచ్చేనా ఎవరో ? ప్రజలే నిర్నేతలు పై నుండి క్రిందకు దింపడానికి . మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది ప్రజల రిసీవింగ్ ని బట్టి మనకు అర్థమవుతుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఈడ్చి నేలకు కొడితే ప్రగతి భవన్ నుండి సెక్యూరిటీ లేకుండా పామ్ హౌస్ కి పోయి మదన పడుతున్న కెసిఆర్ … చేసిన తప్పులను గుర్తు చేసుకొని పొర్లుదండాలు పెట్టిన మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకుండా చేతులారా చెడగొట్టుకుంది బిఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజల ప్రక్షాన స్పందించాల్సిన సమయంలో గాఢ నిద్రలో ఉన్నాడు ముఖ్యమంత్రి. గ్రౌండ్ లెవెల్ లో ఎమ్మెల్యేల అరాచకాలు ఎక్కువయ్యాయి, పథకాలు పక్కా మనవాళ్ళకే అన్నారు. మీము రాజులం మీరు సామంతులు చెప్పింది చేయండి అనే అహంకారంతో పోయారు. ఈ పరిస్థితిలో ఎన్నికల పేరుతో మీటింగ్స్ పెట్టిన, ప్రజలతో మాట్లాడిన యుగం డిజిటల్ కాబట్టి సోషల్ మీడియాని మనసుపెట్టి అడుగుతే తెలిసేది మీ పరిపాలన ఏ విధంగా ఉందో గూగుల్ మ్యాప్ ని, సోషల్ మీడియాని నమ్ముకున్న కెసిఆర్, ట్విట్టర్ పిట్టగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ అసలు నాకేం తెలవదు అన్నట్లుగా వ్యవహరించడమే బుద్ధి తక్కువ వ్యవహారం.

ఎన్నికల పేరుతో ఎన్ని సభలల్లో పాల్గొన్నాడో అన్ని సభలలో కెసిఆర్ కి వ్యతిరేక నినాదాలు స్పష్టంగా కనిపించాయి, వినిపించాయి అయినా వాటిపై ఎక్కడ స్పందించలేదు. ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు ఏ అవసరం వచ్చిన అండగా లేని నీవు ఎన్నికల సమయంలో రోజుకు మూడు సభల పేరుతో హెలికాప్టర్ లో తిరిగితే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనుకున్నావు. ప్రగతి భవన్ ని, ఫామ్ హౌస్ ని విడిచి ఏ రోజు కూడా సచివాలయానికి, ప్రజల మధ్యకు రాలేదు. నీవు ఇప్పుడు ఓటు అడిగితే ఎట్లేస్తారు ఆ ప్రజలు. ప్రతి సభలో కేసీఆర్ చెప్పే వైకుంఠపాళీ కథ ప్రజలు ఓటు రూపంలో ఆయనకే చెప్పారు. ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఒక్క మెట్టు కాదు 100 మెట్లు దిగి తన పబ్లిసిటీ కోసం గారడి చేశాడు. విలేజ్ షో తో పంట పొలాల్లో నాటకాలు ఆడిన, నిరుద్యోగుల బాధలను రూపుమాపుతాం అంటూ యువత మెప్పు కోసం మెట్లు దిగి కింద కూర్చున్న నిరుద్యోగులు, ప్రజలు ఎవ్వరూ కూడా కెసిఆర్ పాలనను నచ్చలేదు. ఎందుకంటే కెసిఆర్ మాటల్లో నిజాయితీ తప్పింది కేటీఆర్ మాటల్లో అహంకారం పెరిగింది. ఐటీ పేరుతో మాటలు చెబుతున్న మీకు 1986 లో డిజిటల్ యుగానికి నాంది పలికిన మన ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ అని తెలియదా ? 1991 మన తెలుగుతేజం అప్పటి పీఎం పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ తీసుకున్న సాహసోపీతమైన సరళీకృత ఆర్థిక విధానాలు దేశ ప్రగతిని మార్చాయి అన్నది తెలియదా?

1996 లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఐటీ రంగంలో మన దేశంలో మన రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, YS రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకొని ఇతర దేశాల్లో ఐటీ కొలువలు పొందిన విద్యార్థులతో మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. కెసిఆర్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడనేది వాస్తవికం. ప్రైవేటు యూనివర్సిటీల పేరుతో లక్షల్లో వసూలు చేసే వ్యాపారులతో స్నేహం చేశాడు. విద్య, వైద్యం కోసం పేదలు ఎదురు చూస్తుంటే వాళ్ల నోట్లో మట్టి కొట్టాడు. అయినా ఇప్పుడు తన పాత్ర శూన్యం అని తెలిసాక అభివృద్ధి, పథకాలు, ప్రజా సమస్యల పై కేసీఆర్ ను నిలదీయడం ఎందుకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కేసీఆర్ పాత్ర ఇందులో శూన్యం. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎప్పటికప్పుడు అధికారులు పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ వాస్తవికతను మీ ముందు ఉంచితే కనీసం జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక్క పిలుపునిస్తే ప్రాణాలు పోయినా పర్వాలేదు నీ వెంట ఉంటాం అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యోగులను చిన్నచూపు చూసిన, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన అయినా మా ఉద్యమనేత అంటూ 2018 లో నీ వెంట ఉన్నారు చూసావా అప్పుడైనా నీకు అర్థం కాలేదు. ఎమ్మెల్యేలుగా పది సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు ఉన్నా వాళ్లు కనీసం ఎన్నికల సమయంలో ఖర్చు చేయడానికి మీ నుండి రావాల్సిన డబ్బు రాకపోవడం తో వాళ్ళు ఓడిపోతారు అని తెలిసి మీరు నిధి కోతకొస్తే వాళ్ళ ఖర్చులకోసం డబ్బులడుగుతే అప్పులు కూడా ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే బంధువులు, ఆత్మీయులు ఉన్నారంటే ఎమ్మెల్యే లను, వాళ్లతో పాటు ఉన్నవాళ్ళను ఎంత నమ్ముతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజున నాకు ఉన్నా పరిచయలతో కోట్లు తేగలుగుతాను. మరి దాదాపు ఆరు కోట్ల జనాభా ఉన్నా తెలంగాణ లో 119 మంది మాత్రమే స్పెషల్ అనుకునే ఎమ్మెల్యే పదవి ఉండి కూడా అప్పు అడుగుతే తప్పించుకునే స్థితి వచ్చింది అంటే వాళ్ల తప్పా ? లేక మీ పరిపాలన గాడి తప్పిందా? అర్థం చేసుకోవాలి.

అయినా డబ్బుకు అమ్ముడు పోయే ఓటర్లతో మనకేంటి లెక్క కొని పడేద్దామనుకున్నారు కదా ఏమైంది మరి మీ లెక్కల చిట్టా. ఎటు పోయింది మీ ఓటు బ్యాంకు. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బిఆర్ఎస్ అభ్యర్థులకు పోటీపడి డబ్బులు పంచ లేకపోయారు. గ్రౌండ్ లెవల్ లో ఆ వ్యవస్థ కూడా వాళ్లకు లేదు. ఉదయం లేస్తే పథకాలు పబ్లిక్ సిటీ కోసం ఆరాటపడ్డారు కదా ఏమైంది మరి ఈరోజు. మీ పాలని సక్కగుంటే ఎందుకీ నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. ఒక్కొక్కరికి 45 వేల మెజార్టీకి తక్కువ రాలేదు అని అంటే ఈరోజు గెలిచిన వాళ్లపై ఉన్న ప్రేమ కంటే మీ మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాలి క్రింది స్థాయి నేతలు కూడా మీ పరిపాలన, ఎమ్మెల్యే ల వైఖరి నచ్చక ఇతరులకు సహకరిస్తేనే మీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే గెలుపొందిన వారి మెజారిటీ ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. మరి కొత్త ప్రభుత్వంలో కొలువుదీరే నాయకులు అయినా సరే ప్రజలకు దగ్గరగా ప్రజా ఆలోచనలకు దగ్గర ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

(ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ సమయం వచ్చినప్పుడు చెబుతుంటా..!!)