దేశంలో చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంచరీ దాటిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు.. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 4 పైసలకు చేరుకుంది. అలాగే డీజిల్ 98 రూపాయల 42 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో నిన్న 114 రూపాయల 12 పైసలున్న పెట్రోల్ ఈ రోజు 114 రూపాయల 49 పైసలకు చేరుకుంది. డీజిల్ ధర 107 రూపాయల 40 పైసలుగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఉన్న ఇంధనం ధరలను చూస్తే… కరీంనగర్‌లో పెట్రోల్ 114 రూపాయల 31 పైసలు, డీజిల్ 107 రూపాయల 56 పైసలైతే… నిజామాబాద్‌లో పెట్రోల్ 115 రూపాయలను దాటుకొని 116 రూపాయల 8 పైసలకు చేరుకుంది. డీజిల్ 109 రూపాయల 22 పైసలుగా ఉంది. అయితే ఆదిలాబాద్‌లో 116 కు చేరువగా ఉన్న పెట్రోల్ ఈ రోజు 115 రూపాయల 91 పైసలుగా ఉంటే, ఇక్కడ డీజిల్ 109 రూపాయల 61 పైసలుగా ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్ వాత పెట్రేగిపోతోంది. ఇక్కడి ధరల్ని పరిశీలిస్తే, విజయవాడలో పెట్రోల్ 115 రూపాయల 74 పైసలుగా ఉంటే, డీజిల్ ధర నిన్నటి మీద స్వల్పంగా తగ్గి 108 రూపాయల 12 పైసలుగా ఉంది. గుంటూరులో పెట్రోల్ 115 రూపాయలను దాటి 116 రూపాయల 27 పైసలకు చేరుకుంది. డీజిల్ స్థిరంగా 108 రూపాయల 89 పైసలు ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ 115 రూపాయల 6 పైసలు, డీజిల్ ధర 107 రూపాయల 48 పైసలుగా ఉంది. ఇక చిత్తూరులో 120కి చేరుకుంటుందేమో అన్నట్లు అత్యధికంగా పెట్రోల్ 117 రూపాయల 25 పైసలుగా ఉంది. డీజిల్ స్వల్పంగా తగ్గి 108 రూపాయల 90 పైసలకు చేరుకుంది.