టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారీ కేసీఆర్ ఏకగ్రీవం..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని ఇబ్బందులు పడినా ఓ మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అన్నీరంగాల్లో స్థిరీకరణ సాధించిన తరువాత మనం అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలిచామన్నారు.
కాగా దళితబంధు మహా ఉద్యమంగా సాగుతోందని కేసీఆర్ ఆకాంక్షించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ 3కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోందని కేసీఆర్ అన్నారు. విద్యుత్ రంగంలో 11.5శాతం వృద్ధి రేటులో ముందంజలో ఉన్నామని వివరించారు. తెలంగాణలో వలసలు తగ్గాయని ఇప్పుడు పాలమూరుకే వలస వస్తున్నారన్నారని కేసీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా అమలులో లేని రైతుబీమాను తెలంగాణలో గుంట భూమి ఉన్నా బీమా అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.అవినీతిని రూపుమాపేందుకు ధరణీ పోర్టల్ ను ఆవిష్కరించామని కేసీఆర్ తెలిపారు.

Optimized by Optimole