చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదిలిస్తోంది : కేంద్ర మంత్రి జై శంకర్

చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదిలిస్తోంది : కేంద్ర మంత్రి జై శంకర్

భారత్ – చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు భారత్  గట్టిగా బదులిస్తోందన్నారు.  ఇది గమనించిన ప్రపంచ దేశాలు… భారత్  ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన కుయుక్తులను భారత్  బలంగా తిప్పికొట్టిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇక  గతంలో కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దులను మార్చేందుకు చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించిందని జై శంకర్ గుర్తుచేశారు. సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ డ్రాగన్  దుశ్చర్యలను సైనికులు దీటుగా తిప్పికొట్టారని కొనియాడారు. అవసరమైనప్పుడు కొన్ని అంశాల నుంచి భారత్  దూరంగా ఉంటుందని…. కావాలనుకున్నప్పుడు గళాన్ని గట్టిగా వినిపిస్తుందని   స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన రంగాల్లో ఇతర దేశాలతో కలిసి నడుస్తుందని చెప్పారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాతో భారత్  సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.