యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా. శుక్రవారం గోరఖ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్షా మాట్లాడుతూ..2014, 2017, 2019 మాదిరి.. ఈ సారి కూడా యూపీలో గెలిచేది బీజేపీ అని అమిత్షా స్పష్టం చేశారు. 2013లో తాను యూపీ బీజేపి ఎన్నికల ఇంచార్జ్గా వచ్చానని.. అప్పుడు అందరూ కనీసం బీజేపికి రెండంకెల సీట్లు వస్తే గొప్ప విషయమన్నారు. కానీ ఎన్నికల తర్వాత.. ప్రతిపక్షాలను రెండంకెల సీట్లకు పరిమితం చేశామని గుర్తు చేశారు. యూపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్రంలో, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని అమిత్షా ధీమా వ్యక్తం చేశారు.