వేగంగా టీకాలు వేసిన దేశంగా భారత్ !

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ముందుగా ప్రారంభించగా మన దేశంలో మాత్రం జనవరి 16న ప్రారంభం కావడం గమనార్హం. భారత్ మొదటి దశలో కేవలం 13 రోజుల్లోనే 30 లక్షల టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ , అమెరికాను అధిగమించినట్లు వెల్లడించింది. అమెరికాలో 30 లక్షల టీకాలు వేయడానికి కి 18 రోజుల పట్టగా.. ఇజ్రాయిల్ లో 33 రోజులు, యునైటెడ్ కింగ్డం లో 30 రోజులు సమయం పట్టింది.

కాగా దేశంలోని రాష్ట్రాల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2,94, 959 మందికి, కర్ణాటకలో 2,86,089 మందికి, మహారాష్ట్రలో 2,20,587 మందికి టీకాలు వేశారు.