బిజెపి కార్యకర్తల అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు హుమాయున్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ‘ దేశ ద్రోహులను కాల్చి పారేయాలి ‘ అంటూ చేసిన వ్యాఖ్యలనుగుణంగా కబీర్ వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు , పలువురు ఉన్నతాధికారులు రాజీనామాల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల ముందు సువెందు అధికారి , రాజీవ్ బెనర్జీ లు వారి పదవులతో పాటు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హిందూ ఓటర్లను ఆకర్షించడానికి , హిందీ మాట్లాడే వారితో ఇటీవలే టీఎంసీ ప్రధాన కార్యాలయంలో దీదీ సమావేశమయ్యారని గవర్నర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.