విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే జనసేన ధ్యేయమని తేల్చిచెప్పారు. వారాహి కి ప్రత్యేక పూజలో భాగంగా .. ఇంద్రకీలాద్రికి వెళ్లిన పవన్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతరాలయం గుండా అమ్మవారిని దర్శించుకున్న పవన్ .. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పవన్ తో పాటు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.