మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతి విశిష్ట‌త‌..

మాఘ‌మాసంలో శుక్ల చ‌తుర్థి రోజున మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతిని జ‌రుపుకుంటారు. మాఘ వినాయ‌క చ‌తుర్థి.. మాఘ శుక్లా చ‌తుర్థి.. తిల్కుండ్ చ‌తుర్థి.. వ‌ర‌ద చ‌తుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున‌ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక అభిషేకాలు..హోమాలు.. పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ,గోవాలో ఈ పండుగ‌ను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జ‌రుపుకుంటారు.ఈరోజు గ‌ణ‌ప‌తికి ఎంతో ఇష్ట‌మైన ఎరుపు రంగు గ‌ల మందార,క‌లువ పూల‌తో అల‌కరింస్తారు. జిల్లేడు పూలు,గ‌రిక ,తుమ్మి.. బిల్వ ప‌త్రాల‌తో పూజ చేస్తే అవ‌రోధాలు తొల‌గిపోయి,,ఆయురారోగ్యం.. అష్టైశ్వ‌రాలు చేకూరుతాయ‌ని భక్తుల న‌మ్మ‌కం.

ఈపండుగ రోజున భ‌క్తులు గ‌ణ‌నాథుడుకి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి.. ఉప‌వాసం పాటిస్తారు. అలా చేస్తే సంవత్స‌రం మొత్తం శుభం జ‌రుగుతుంద‌ని భ‌క్తుల విశ్వాసం. ఎర్ర‌టి బ‌ట్ట‌లు ధ‌రించి.. స్వామికి ఇష్ట‌మైన పూల‌తో అల‌కరించి..స్వీట్లు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.పురాణాల ప్ర‌కారం.. ఈరోజున చంద్రుడిని చూస్తే.. సంవ‌త్స‌ర‌మంతా మాన‌సిక క్షోభ గురికావ‌డంతో.. నింద‌లు ఎదుర్కొవ‌ల్సి వ‌స్తుంద‌ని శాస్త్రం చెబుతుంది.

ఇక మ‌హారాష్ట్ర‌లో గ‌ణేష్ విగ్ర‌హాల‌ను ఇంటికి తీసుకొచ్చి.. పూజుల నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఉద‌యాన్నే గ‌ణ‌నాథుడి ఆల‌యాల‌ను సంద‌ర్శించి మొక్కులు చెల్లించుకుంటారు.వేడుక‌ల్లో భాగంగా అష్ట వినాయ‌క ఆల‌యాల‌ను అందంగా స్వామికి ఇష్ట‌మైన పూల‌తో అలంక‌రిస్తారు.