పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ ‘ లైగర్’..

యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. అనన్య పాండే కథానాయిక. కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్ర ట్రైలర్ నూ..మెగాస్టార్‌ చిరంజీవి, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. ‘ ఒక లయన్ కి.. టైగర్ కి పుట్టాడు సర్ నా బిడ్డా.. క్రాస్ బ్రీడ్’ అంటూ రమ్యకృష్ణ చెప్పిన పూరి మార్క్ డైలాగ్ పేలింది. విజయ్ పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ..ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ బాక్సింగ్‌ సన్నివేశాలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి.

ఇక లైగర్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.