PawanKalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Posted inAndhra Pradesh Latest News politics