కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు.
కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా ఉన్న రవిశాస్త్రి, ధోనీకి థ్యాంక్స్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాన్న కొహ్లీ.. టీమిండియాను సరైన దిశగా నడిపించేందుకు కృషి చేశానన్నాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన కొహ్లీ నేతృత్వంలోని భారత జట్టు 68 టెస్ట్‌లు ఆడి.. 40 మ్యాచ్‌ల్లో గెలిచింది. కేవలం 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. దాదాపు 59శాతం విన్నింగ్‌ పర్సంటేజ్‌తో కొహ్లీ నెంబర్‌ 1 ఇండియన్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కొహ్లీ తర్వాత స్థానంలో ధోనీ, గంగూలీ ఉన్నారు. వన్డేలు, టీ20ల్లో కూడా కొహ్లీనే నెంబర్‌-1 కెప్టెన్‌. విదేశీ గడ్డపై టీమిండియాను పవర్‌పుల్‌గా నడిపించిన నాయకుడిగా కోహ్లీ.. ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్ల సరసన చేరాడు.