వాట్సప్ బయోమెట్రిక్ ఫీచర్ !

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్టాప్, లాప్టాప్ వాట్సాప్ వినియోగానికి సంబంధించి బయోమెట్రిక్ అతెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. బయోమెట్రిక్ విధానం వలన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో డేటా దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చు. బయోమెట్రిక్ విధానం కోసం వేలి గుర్తులేదా ఫేస్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ పేర్కొంది.
కాగా వాట్సప్ నూతనంగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ అమలైతే , పేమెంట్ ఫీచర్ వాడకం ఆపేస్తామని తెలిపింది. ఈ విషయమై ఓ సంస్థ 17 వేల మంది అభిప్రాయాలను సేకరించగా 92% మంది పేమెంట్ వాడకాన్ని ఆపేస్తామని అని తేలింది.

Optimized by Optimole