సీనియర్ జర్నలిస్ట్ నెల జీతం కోత!

సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడంతో ఇండియాటుడే గ్రూప్ అతని నెల జీతం కోత విధించడంతో పాటు, రెండు వారాల పాటు విధుల నుంచి తప్పించింది . రిపబ్లిక్ డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పోలీసుల కాల్పుల్లో రైతు మరణించాడని చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడంతో సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక రిపబ్లిక్ డే రోజు అల్లర్ల ఘటనపై దేశవ్యాప్త చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాజ్ దీప్ చేసిన ట్వీట్ విమర్శలపాలు కావడంతో ట్వీట్ వెంటనే తొలగించాడు. బాధ్యత గల వ్యక్తి ఇలా చేయడం సబబు కాదని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శల గుప్పిస్తున్నారు.

కాగా ఇదే విషయమై ఢిల్లీ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా బుధవారం ట్వీట్ చేస్తూ.. రాజ్దీప్ అబద్ధం ఆడాడు, అసత్యాలను ప్రచారం చేయగా పోలీసులు వీడియో ద్వారా బయట పెట్టారని, పోలీసులపై దాడికి ప్రేరేపించాడని మిశ్రా ట్విట్టర్లో పేర్కొన్నాడు.