ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తరిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నిపుణుల సూచన మేరుకు ఈవ్యాధిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. కరోనా మాదిరి వ్యాపిస్తున్న వైరస్ కట్టడికి.. దేశాలన్నీ సమన్వయంగా పోరాడాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.
ఇక దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ఠ్రంలోనే మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర పటిష్ట చర్యలను చేపట్టింది. విమానాశ్రయాలు, ఓడరేవులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రయాణికులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండదా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇక ఇప్పటీవరకు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 14 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా.. ఐదుగురు మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో తొలిసారిగా చిన్నారుల్లోనూ మంకీపాక్స్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో నమోదైన కేసుల్లో 99 శాతం గే లేదా బైసెక్సువల్ వ్యక్తులే ఉన్నారు. ఇంగ్లాండ్ పరిశోధకుల అధ్యయనంలోనూ.. వైరస్ నిర్ధారణ వ్యక్తుల్లో 98 శాతం గే లేదా బైసెక్సువల్ పురుషులేనని వెల్లడైంది. లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మంకీపాక్స్ వైరస్ సందేహాలు ఉంటే ఈక్రింది లింక్ ఓపెన్ చేసి చదవండి..