Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం. ఈ ఆలయంలోని అమ్మవారిని రాత్రి పూట పూజించడం ఇక్కడి ప్రత్యేకత.అసలు అమ్మవారిని రాత్రి పూట మాత్రమే ఎందుకు పూజిస్తారు? ఇతర ఆలయాల్లో మాదిరిగా ఉదయం వేళల్లో పూజలు జరిపిస్తే ఏమవుతుంది?
కాశీని కాపాడే గ్రామదేవతగా ఉగ్రవారహి అమ్మవారిని అక్కడి ప్రజలు కొలుస్తారు. ఈ అమ్మవారిని ఉదయం 4:30 నుండి 8:30 వరకే దర్శించుకోవడానికి వీలుంటుంది. ఆ తర్వాత ఆలయం అర్ధరాత్రి తరువాత మూసివేస్తారు. ఎందుకని అంటే అమ్మవారు గ్రామదేవత. చీకటి పడిన తర్వాత గ్రామం అంతా సంచరిస్తూ, వాకిలి వద్ద సంరక్షణగా నిలబడతారని అక్కడి ప్రజల నమ్మకం. విశ్రాంతి కోసం తెల్లవారుజామున అమ్మవారు గర్భగృహంలోకి ప్రవేశిస్తారు. అందుకే పూజారులు ఉదయం వేళలే అలంకరణ, హారతులు పూర్తిచేసి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.
ఈ గర్భాలయం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. భక్తులు రెండు చిన్న కిటికీల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించవచ్చు. ఒక కిటికీలో అమ్మవారి ముఖం కనిపిస్తుంది. మరొక కిటికీ ద్వారా పాదాల దర్శనం కలుగుతుంది. నేరుగా గర్భగృహంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ఉగ్రకళలో ఆవిర్భవించారని పురాణ వచనం.
ఇక ఉగ్రవారహీ అమ్మవారి ఆలయం గురించి పూజారి మాటల్లో చెప్పాలంటే –” అమ్మవారి శాంతరూపమైన అవతారాన్ని ఎదురుగా దర్శించవచ్చు. కానీ ఉగ్రరూపాన్ని అనగా దుష్టశిక్షణార్థంగా ధరించిన అమ్మవారి రూపం. ఆ రూపం చూసి సామాన్య సామాన్య భక్తులు తట్టుకోలేరు. సూర్యుడిని ఉదయం చూస్తే శుభం, మధ్యాహ్నం నేరుగా చూస్తే కళ్ళు పోతాయి అనే తత్వం ఇక్కడి అమ్మవారి దర్శనానికి వర్తిస్తుంది.”
పురాణ కథ…
ఇలాంటి అపూర్వ ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక హృదయవిదారక ఘటన భక్తుల మనస్సుల్లో నిలిచిపోయింది. ఒక కొత్తగా పెళ్లయిన జంట, వారణాసిలో పుణ్యక్షేత్రాల సందర్శన సందర్భంగా ఈ ఆలయానికి వచ్చారు. ఆలయ నియమాలను లెక్కచేయకుండా, నేరుగా అమ్మవారిని దర్శించాలని మూర్ఖపు ప్రయత్నం చేశారు. “అమ్మవారి దర్శనం కోసం మానవ హక్కుల కోణంలో కోర్టుకే వెళతాం” అని ఆలయ పూజరితో వాదనలు చేశారు. పూజారి వారిని ఆపలేక గర్భాలయానికి తీసుకెళ్లాడు. కానీ అమ్మవారి ఉగ్రరూపాన్ని తట్టుకోలేక ఆ దంపతులు క్షణాల్లోనే ప్రాణాలు విడిచారని అక్కడి భక్తులు చెబుతారు.
ఈ ఘటన చరిత్రగా, హెచ్చరికగా, భక్తుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసింది. “ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః” అనే నినాదం ఇక్కడ ప్రతిధ్వనించే మంత్రంగా మారింది.
ఈ ఆలయం ద్వారా మనం తెలుసుకోవలసింది ఒక్కటే – దేవతల విశిష్టతను, వారి ఆవిర్భావాల గంభీరతను మన బుద్ధి కొలతలతో అంచనా వేయకూడదు. భక్తి అంటే విధేయత, వినయం, నియమానికి లోబడి ఆరాధన చేయడం. అలా చేయగలిగినవారికి అమ్మవారి కరుణ అమూల్యమైన వరంగా మారుతుంది.
జై భూషణ వాహినీ, ఉగ్ర రూపిణి, గ్రామరక్షకీ – శ్రీ వారాహీ మాతకి జై!
_anrwriting