కలవరపెడుతున్న ఎల్లో ఫంగస్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ జాబితలోకి ఎల్లో ఫంగస్ చేరింది. యూపీ ఘజియాబాద్ లో మొదటి ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. అయితే మొదటి రెండు ఫంగస్ల కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనాతో అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడం ఎల్లో ఫంగస్ లక్షణాలు.. అది తీవ్రరూపం దాలిస్తే చీము కారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఉన్నటువంటి గాయాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని అన్నారు. క్కువ తేమగా ఉండడం కూడా ఎల్లో ఫంగస్ విస్తరణకు కారణమవుతుందని.. తేమ 30% – 40% మధ్య ఉంటే ఈ ఫంగస్ ఎక్కువగా ఉంటున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.