సంగారెడ్డి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని క ఓ యువకుడు ఘోరానికి ఒడిగట్టాడు. ఆమెను న గొంతుకోసి హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన బొత్స శ్రీనివాస రావు, ఈశ్వరమ్మ దంపతులు సుదీర్ఘకాలంగా సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె రమ్య (23), చందానగర్‌లోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది.
రమ్య గత మూడేళ్లుగా మెదక్ జిల్లా మన్నేపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ప్రేమలో ఉండేది. గతంలో వీరి ప్రేమ విషయం ఇరువురు కుటుంబాలకు తెలిసి, పెళ్లికి నిరాకరించారు. అందులో భాగంగానే 6 నెలల క్రితం ప్రవీణ్, రమ్యను తనతో పెళ్లి చేయాలని రమ్య తల్లిదండ్రులను కోరాడు. అయితే వారు నో చెప్పి, ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారు.
ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన ప్రవీణ్, సోమవారం రమ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను కలవడానికి వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, రమ్య చదువు పూర్తయ్యే వరకు ఆలోచించేద్దామని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రవీణ్ తనతో పాటు తీసుకొచ్చిన కత్తితో రమ్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తానూ అదే కత్తితో తనను తాను గాయపర్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అప్పటికే ఇంటికి చేరుకున్న రమ్య తల్లిదండ్రులు రక్తపు మడుగుల్లో పడివున్న ఇద్దరిని చూసి షాక్‌కు గురయ్యారు. అప్పటికే రమ్య మృతి చెందగా, గాయపడిన ప్రవీణ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.