దేశంలోని ఆన్లైన్ సంస్థల(అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్) వ్యాపార విధానాల వలన, సంప్రదాయ వృత్తుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయన్న నేపథ్యంలో ఎఫ్ డి ఐ నిబంధనల్లో సవరణలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇ- కామర్స్లో వంద శాతం అనుమతున్న ఎఫ్ డీఐకి నిబంధనల ప్రకారం, కొనుగులుదార్లు, వినియోగదార్లకు మధ్య మార్కెట్ ప్లేస్ గా మాత్రమే వ్యవహరించాలి.. 2018 ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం ఏదేని విక్రయ సంస్థలో ఇ-కామర్స్ సంస్థ వాటా కలిగి ఉంటే, అసంస్థ ఉత్పత్తులను వారి ప్లాట్ ఫామ్ పై విక్రయించకూడదనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుత వ్యాపార పరిస్థితుల దృష్ట్యా, ఇ- కామర్స్ మాతృసంస్థ ఏదేని విక్రయ సంస్థలో పరోక్ష వాటా కలిగి ఉన్నట్లయితే, అసంస్థ ఉత్పత్తులను విక్రయించకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.