Bandisanjay:‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు. ఎంఐఎం నేతలున్నరు. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకుంటరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నుండి 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని, ఎన్డీఏలో చేరబోతున్నామని ఆ పార్టీ నేతలకు అబద్దాలు చెబుతూ ఎవరూ పార్టీని వీడకుండా డ్రామాలాడుతున్నరు. కేసీఆర్ ఎంతకైనా దిగజారు. అయినా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీని ఏన్డీఏలో చేర్చుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయే నావ. ఒక్కసీటు కూడా రాని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు’’అని కుండ బద్దలు కొట్టారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని,.. ఒకవేళ అదే జరిగితే బీజేపీలో సగంమంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనుకాడతారని అన్నారు. కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారని, ఈసారి బీజేపీకి వాళ్లంతా ఓటేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు.
*25 నుండి మలివిడతల ప్రజాహిత యాత్ర షురూ.. *
* తొలిదశ ప్రజాహిత యాత్రకు మంచి స్పందన లభించింది. ఏ ఊరికి పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు. మోదీ గాలి వీస్తోంది. ముఖ్యంగా యువత జోష్ తో ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిదశ యాత్ర పూర్తయ్యింది. ఈనెల 25 నుండి మలి విడత ప్రజాహిత యాత్రను కొనసాగిస్తాం. మధ్యలో మూడు రోజులపాటు(ఈనెల 20 నుండి) రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు బస్సు యాత్రల్లో పాల్గొంటాను.
*బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కేసీఆర్ డ్రామా…. *
ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా. కేసీఆర్ తన స్వార్ధం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎంత నీచానికైనా పాల్పడతాడు. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మాతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న కేసీఆర్ చాలా తెలివిగా బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరబోతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని సొంత పార్టీ నాయకులకు సంకేతాలు పంపుతున్నారు. బీఆర్ఎస్సే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంటే.. ఇంకా మనం బీజేపీలోకి వెళ్లడం ఎందుకు దండుగ అనే భావన కలిగేలా డ్రామాలాడుతున్నరే అందులో ఇసుమంతైనా నిజం లేదు.
*అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను ఎన్డీఏలో చేర్చుకోలే… ఇప్పుడెందుకు ఆలోచిస్తాం…? *
ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. కేసీఆర్ వెళ్లి కలిసినా ఎన్డీఏలో చేర్చుకునేది లేదని మోదీ తెగేసి చెప్పారు. స్వయంగా ప్రధానమంత్రి మోదీ కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బహిరంగంగానే చెప్పారు. పైగా బీఆర్ఎస్ ఇప్పుడు మునిగిపోయే నావ. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. పోటీ చేయడానికి అభ్యర్ధులే కరువయ్యారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీసహా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోరు. పైగా సొంతంగానే బీజేపికి 4 వందల సీట్లు రాబోతున్నయ్. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకేంది? బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే సగం మంది బీజేపీ నేతలు పోటీ చేసే విషయంలో పునరాలోచిస్తారేమో.