గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ”  శ్లోకం అసలు కథ తెలుసా?

గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ” శ్లోకం అసలు కథ తెలుసా?

గురుశ్లోకం;

” గురు బ్రహ్మా గురు విష్ణు

గురుదేవో మహేశ్వర

గురు సాక్షాత్ పర బ్రహ్మా

తస్మై శ్రీ గురువే నమ: ” 

 ఈశ్లోకం అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కథ  ఎవరికీ తెలియదు. అసలు మొదట ఈశ్లోకం ఎవరు పలికారు? ఎందుకు పలికారో తెలుసుకుందాం!

పురాణకథ ;

 పూర్వం నిరుపేద కుటుంబానికి చెందిన కౌత్సుడు ఓ ఆశ్రమంలో విద్యాధరుడు అనే గురువువద్ద విద్య నేర్చుకునేవాడు. ఓసారి గురువు పనిమీద బయటికి వెళ్లాడు. అయితే గురువు లేనిలోటు తెలియకుండా కౌత్సుడు ఆశ్రమాన్ని శ్రద్ధగా చూసుకున్నాడు. గురువు తిరిగొచ్చిన తర్వాత అతని విద్య పూర్తయింది. కౌత్సుడును తీసుకెళ్లడానికి అతడి తల్లిదండ్రులు ఆశ్రమానికొచ్చారు. కానీ అతను గురువు దగ్గరే ఉంటానని ఖరాఖండిగా చెప్పడంతో తల్లిదండ్రులు వెనక్కి వెళ్లిపోయారు.

ఇక కౌత్సుడిని గురువు గారు ఇంటికి ఎందుకు వెళ్లలేదని?  కారణం అడిగాడు. బదులుగా కౌత్సుడు ” గురువు గారు మీరు ఆశ్రమం నుంచి బయటికి వెళ్లినప్పుడు మీ జాతకం చూశాను. సమీప భవిష్యత్తులో మీరు భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకు మిమ్మల్ని వదిలివెళ్లలేను ” అని కౌత్సుడు సమాధానం చెప్పాడు. 

జాతకం ప్రకారం కొన్ని రోజుల తర్వాత గురువు విద్యాధరుడికి క్షయం రోగం వచ్చింది. ఆకాలంలో క్షయకు సరైన చికిత్స లేకపోవడంతో  దాన ధర్మాలు, పుణ్యకారాలు చేయాలని గురుశిష్యులు ఇద్దరు కాశీకి వెళ్లారు. అయితే విద్యాధరుడి రోగం చూసి అక్కడి ప్రజలు అసహ్యించుకున్నారు.  కానీ కౌత్సుడు మాత్రం ధర్మబద్ధంగా గురువుకు సేవలు చేస్తూనే ఉన్నాడు. తనను వదిలి వెళ్లమని గురువు చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా సేవలు చేయసాగాడు.

కౌత్సుడి పరీక్ష;

 కౌత్సుడి గురుభక్తి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరిక్షించాలనుకున్నారు. మొదటగా బ్రహ్మా మారువేషంలో వెళ్లి గురువుని వదిలివేయమని కౌత్సుడికి సలహాఇచ్చాడు. అతను బ్రహ్మా చెప్పిన మాటలు విని గురువును వదిలివెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. రెండోసారి విష్ణువు ..మూడో సారి పరమేశ్వరుడు వచ్చిన గురువును వదిలివెళ్లమని చెప్పినా కౌత్సుడు వెళ్లనని సమాధానమిచ్చాడు.

కౌత్సుడి గురుభక్తి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయి.. ఏదైన వరం కోరుకొమని అడిగారు. అతడు ” మరెవరూ గురువును వదిలివెళ్లమని సలహా ఇవ్వకుండా చూడమని కోరాడు ” . అంతేకాక సమస్తలోకాలకు సర్వం అయిన మీరు ప్రత్యక్షం కావడానికి  ” నాగురువే నాకు బ్రహ్మా.. నాగురువే నాకు విష్ణువు.. నాగురువే నాకు మహేశ్వరుడు ”  అంటూ కౌత్సుడు గురు భక్తిని చాటుకున్నాడు.

అనంతరం కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు విద్యాధరుడి రోగం నయం చేశారు. ఆనందంలో కౌత్సుడు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోయాడు.