ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ : ఎస్పీ అపూర్వ రావు

నల్లగొండ: మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదని హెచ్చరించారు ఎస్పీ అపూర్వ రావు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 1188 మంది పట్టుబడ్డారని తెలిపారు. 453 మందిని కోర్టు లో హాజరుపరిచి.. 21 మందికి ఒక రోజు, 08 మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష జరిమానా వేస్తూ తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన వ్యక్తులకు జరిమానా విధించారన్నారు. పిబ్రవరిలో మొత్తం 1188 డి.డి కేసులు నమోదు కాగా 17 లక్షల 8 వేల 830 రూపాయల జరిమాన విధించారని ఎస్పీ చెప్పుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు , ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులు బాధ్యత వహంచాలన్నారు. వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ అపూర్వ రావు పేర్కొన్నారు.

Optimized by Optimole