ఆలోచింపజేసే ‘ప్రయాణం ‘ కవిత్వం..

ప్రయాణించు..

లేకపోతే నువ్వొక జాత్యాహంకారిలా మారే ప్రమాదం ఉంది
నీ వొంటి రంగే సిసలైనదని, నీ మాతృభాష మధురమైనది అని అన్నింటా నువ్వే ముందుండగలవని నమ్మే స్థాయికి దిగజారొచ్చు

ప్రయాణించు..
ప్రయాణించకపోతే నీ ఆలోచనలు భావాలతో బలపడవు
నీ ఆశయాలు పసలేని కాళ్ళతో పుడతాయి
నువ్వు భయపడుతూ బతికేంత, పీడకలల్ని ఉత్పత్తి చేసే
టీవీ షోలను నమ్మటం మొదలెడతావు

ప్రయాణించు..
నువ్వు ఏ సూర్యుణ్ణించి వచ్చినా
ఎదుటివారికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది.
నువ్వు లోపల ఎన్ని చీకట్లను మోస్తున్నా
అందరికి శుభరాత్రి చెప్పడం నేర్పుతుంది.

ప్రయాణించు..
ప్రయాణించటం ఆధారపడటం కాకుండా ప్రతిఘటించడం నేర్పుతుంది. వారు ఎవరైనా వారు మనకు ఎప్పటికి ఏమీ కాకపోయినా మనం ఎదుటివారిని అంగీకరించడం నేర్పుతుంది. సంస్కృతీ సాంప్రదాయాల సరిహద్దులకతీతంగా మన సామర్ధ్యాన్ని మనకు తెలియజేస్తుంది

ప్రయాణించు..
లేకపోతే, నువ్వే ఒక అద్భుత చిత్రానివి అని, నీలొనే వెతుక్కోవాల్సిన అందమైన విషయాలు ఉన్నాయని
భ్రమలో బతికేస్తావు.

______________

మూలం: ఇటాలియన్ కవి, జియో ఇవాన్ రాసిన ‘ట్రావెల్’
స్వేచ్ఛానుసరణ: ప్రవీణ్ కుమార్ సోడగిరి.

Optimized by Optimole