జనగాం బీఆర్ఎస్ లో ముసలం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..

Telanganapolitics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగాం టిఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా బి ఆర్ ఎస్ నాయకులతో హైదరాబాద్ టూరిజంలో సమావేశమయ్యారు. అనూహ్యంగా టూరిజంలో ఎమ్మెల్యే ప్రత్యక్షమవడంతో అవాకవ్వడం నేతలవంతయింది.

కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందామని మాత్రమే వచ్చినట్లు తెలిపారు.ఇలాంటి అనైతిక చర్యలను పార్టీ అధిష్టానం ఉపేక్షించదని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరోవైపు అసంతృప్తి నేతలను ఇక్కడికి ఎందుకు వచ్చారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పై చర్చించేందుకు మాత్రమే సమావేశానికి వచ్చినట్లు వారు వివరించారు. 

You May Have Missed

Optimized by Optimole