Suryapeta: సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్,బి జెడ్ సి,ఎం జడ్ సి సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సోమవారం(సెప్టెంబర్ 4 )రోజున హాజరు కావాలని సూచించారు.మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుందని ప్రిన్సిపాల్ ప్రకటనలో తెలిపారు.