Telangana: బీసీ కులగలను ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున నెల రోజుల పాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.రాష్ట్ర శాసనసభలో రెండు చారిత్రాత్మకమైన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్ పాల్గొన్నారు.గత రెండు రోజులుగా అసెంబ్లీలో బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నామని…ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలని ఆయన అభివర్ణించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కుల ఘనన జరపలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ లకు కట్టుబడి బిల్లులకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ రెండు తీర్మానాలతో సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
కాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మంత్రి వర్గం అంత కృషి చేసి బిల్లులను ఆమోదింప జేయడం హర్షించదగ్గ విషయమని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఎంత సంతోషపడ్డామో బిల్లుల ఆమోదంతో అంతే సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.ఇంత సంతోషాన్ని పల్లెల్లో ఇంటింటికి పంచాలని..పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.అలాగే ఏఐసీసీ ఆదేశాల మేరకు జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. ఈ అభియాన్ కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందిస్తామని అన్నారు.బాణాసంచా కాల్చి, ప్లెక్సీలు పెట్టి, ఇంటింటికి కరపత్రాలు పంచి, ఊర్లలో పండగలాగా సంబరాలు జరపాలన్నారు. చారిత్రాత్మకమైన రెండు బిల్లుల ప్రాముఖ్యత ను అందరికి తెలియజేయాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించారు.