హైదరాబాద్:
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్ట సవరణపై గవర్నర్ ఆమోదముద్రకు సంబంధించి గందరగోళం నెలకొంది.
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం–2025 బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సవరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు.
అయితే, గ్రామీణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల సడలింపుకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2025 బిల్లు మాత్రం ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. దీనివల్లే బీసీ రిజర్వేషన్ల పెంపుపై అనవసర గందరగోళం సృష్టయింది.