కేసిఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి_ బండి సంజయ్

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చాలనడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలపాలన్నారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నామన్నారు. త్వరలో ఆయన అరెస్ట్‌ ఖాయమని తెలిసే.. ప్రజల్లో సానుభూతి కోసం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దళితుడైనందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. దళితుల విషయంలో కుట్రకోణాన్ని ఆయన ఇలా బహిర్గతం చేశారన్నారు సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు..?
ప్రభుత్వం తెచ్చిన 317జీవో మంచిదైతే పది మంది ఉపాధ్యాయులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని? సంజయ్ ప్రశ్నించారు. భార్యాభర్తల్ని విడగొట్టిన పాపం కేసీఆర్‌దే అని అన్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 95 సీట్లు వస్తాయంటున్నారని.. ఆ 9 పక్కన 5 తీసేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని.. కానీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేని సంజయ్‌ తేల్చిచెప్పారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole