బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.. డిజిటల్ ప్రొడక్షన్ హౌస్ ఏఎల్టీ బాలాజీ ఈ రియాలిటీ షోనూ నిర్మించనుంది.కాగా ఏక్తా కపూర్ కోసం తొలిసారి వ్యాఖ్యాతగా మారనున్నాను అంటూ కామెంట్ చేసిన కంగనా..కాసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత ఏక్తా కపూర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.టెంప్టేషన్ ఐలాండ్’ అనే అమెరికా షో ఆధారంగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Posted inEntertainment News