×

Nancharaiah merugumala:

…………………………………………………

బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి కంటే వంద రెట్లు పెరిగింది. అందుకుకేనేమో మరి 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ గురుతుపై గెలిచిన కొద్దీ మంది రెడ్డి ఎమ్మెల్యేలు పీ.సబితా రెడ్డి నేతృత్వంలో టీఆరెస్ లో చేరిపోయారు.

తెలంగాణలో రెడ్ల తర్వాత/సమానంగా రాజకీయ తెలివి ఉన్నోళ్లు పద్మనాయకులే (ఓసీ వెలమ) అని జమీందారీ నేపథ్యం లేని కల్వకుంట్ల సీ ఎస్ రావు గారు నిరూపించారు. శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో తెరాస రెడ్డి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుని తెలివైన, డబ్బుకు ఆశపడే/అమ్ముడుపోయే బహు సంఖ్యాక రెడ్లు అంతా తన వైపే ఉన్నారని నిరూపించుకోవాలనేది కేసీఆర్ వ్యూహం. వేలకోట్లు సంపాదించిన కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనుకున్న సమయంలో ఒళ్లు బరువు తగ్గించే మాంచి గవుడ వైద్యుడు డా.బూర నరసయ్య గౌడ్ గారు పెద్ద పద్మ నాయకన్ KCR గారి ప్లాన్ చెడగొట్టారు. పద్మనాయకుడి పార్టీలో టికెట్ రానప్పుడు తెలంగాణ బీసీల్లో బాగా పైకొచ్చిన మున్నూరు కాపుల ఆధిపత్యంలోని కమలం పార్టీలో చేరడమే మేలనుకున్నారు ఒళ్లు కోత డాక్టర్ నరసన్న. తూళ్ల దేవేందర్ గౌడ్ తర్వాత మళ్లీ గౌడ సత్తా చాటిన నరసన్న ఫిరాయింపు పుణ్యమా అని తెలంగాణ చట్టసభల్లో సభ్యత్వం లేని కనకమామిడి స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్, మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, పల్లె రవికుమార్ గౌడ్ వంటి ఓబీసీ నేతలకు టీఆరెస్ లో చక్కటి ప్రవేశం లభించింది. సాధారణ ఎన్నికల్లో బీసీలకు కొద్దిగా కూడా టికెట్లు ఇవ్వని కేసీఆర్ మునుగోడులో బీసీని నిలబెట్టలేదు. కానీ, ముగ్గురు రెడ్ల ముద్దుల పోటీలో టీఆరెస్ రెడ్డి అభ్యర్థిని గెలిపించుకోటానికి గౌడ, తదితర మాజీ టీఆరెస్ ఓబీసీ కులాల నేతలను శరీర ఆలింగనాలతో మళ్లీ  తన సొంత పార్టీలోకి లాక్కోస్తున్నారు.

 

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మూడు ప్రధాన రాజకీయపక్షాల అభ్యర్థులూ రెడ్లు కాబట్టి, నియోజకవర్గంలో బీసీ కులాల జనం ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిపాటి పేరున్న ఓబీసీ నేతలకు డిమాండ్ పెరిగింది. అయితే, తెలంగాణ వచ్చాక రెడ్లు, వెలమలు, బ్రామ్మలు, కోమట్లు వంటి అగ్రకులాలకే ప్రాధాన్యం పెరుగుతుందని, ఎస్సీ, బీసీలు ప్రధాన రాజకీయ పార్టీల లెక్కల్లో కిందే ఉంటారని దివంగత ప్రసిద్ధ పంజాబీ ఖత్రీ పత్రకారుడు కులదీప్ నయ్యర్ 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పిన మాటలు నిజమౌతున్నాయి. సరే, ఎన్నికల్లో కాకపోయినా ఉపఎన్నికల్లో అయినా బీసీ నేతలు, గీతలు బాగుపడడం చూడ్డానికి మాలాంటి పూర్వపు కోస్తా జిల్లాల్లో వేళ్లు, ఊళ్లు ఉన్న వారికి బాగుంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all
Optimized by Optimole