శంకుస్థాపనల పేరిట వైసీపీ ప్రజలను మోసం చేస్తోంది: నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లు దాటిందని..డబ్బులు ఎటుపోతుందని ఆయన ప్రశ్నించారు. శంకు స్థాపనల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ..కాలం వెళ్లదీస్తున్న జగన్ ప్రభుత్వం.. అభివృద్థి పనులు చేయకుండా ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. విశాఖ రాజధాని చేస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయని వైసీపీ ప్రభుత్వం.. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నియోజక వర్గాల అభివృద్ధి..ఉద్యోగాలు.. వలసల నిరోధం వంటివి యువత కోరుకుంటుందని మనోహర్ స్పష్టం చేశారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది త్యాగాలు చేశారని..కానీ ప్లాంట్ ప్రైవేటికరణ విషయంలో వైసీపీ నేతలు నోరు మెదపడంలేదని మనోహర్ మండిపడ్డారు.అలాగే రాజధాని అమరావతి కోసం రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారని.. ఇప్పుడు సీఎం జగన్ రాజధాని మార్చాలని పట్టుబట్టడం మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. ఉత్తరాంధ్ర భూకబ్జాల గురించి ఆధారాలతో సహా చెప్పడానికి రైతులు జనసేన జనవాణి కార్యక్రమానికి క్యూ కడుతున్నారని.. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని మనోహర్ తేల్చిచెప్పారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole