సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు అధికారం దక్కాలని.. అలా దక్కాలి అంటే సాధికారిత రావాలన్నారు. దామాషా పద్ధతి రాజకీయాల్లో లేకున్నా మేమెంతో మాకంతే అన్న పద్ధతి రావాలని జనసేనాని అభిప్రాయపడ్డారు.
అణగారిన వర్గాలకు అధికారం జనసేన నినాదం..
ఇక అణగారిన వర్గాలు కేవలం ఓటు బ్యాంకు కింద మిగిలిపోకూడదని.. కచ్చితంగా వారికి అధికారం దక్కాలన్నదే జనసేన నినాదామని పవన్ తేల్చిచెప్పారు. కొన్ని కులాల నాయకులకు మాత్రమే పదవులు దక్కడం విధానం కాదన్నారు. పూర్తి స్థాయి అధికారం కులానికి దక్కితేనే వారి అభివృద్ధి, అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. అధికారం మొత్తం మాదే అన్నది వైసీపీ విధానం ఐతే… మేమెంతో మాకు అంతే అనే మాట జనసేన పార్టీదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తే లేదు..
ఇదిలా ఉంటే.. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదన్నారు జనసేనాని. అధికారం రాని కులాలను ఒక్కటి చేస్తామన్నారు.ఆంధ్ర థానోస్ చెప్పినట్లు వైసీపీ అవినీతికి జనసేన ఆలంబనకు వర్గ పోరాటం తప్పదన్నారు. బీసీలకు భోజనం పెట్టడమేనా వైసీపీ సాధికారత?అని ప్రశ్నించారు.యువతకు ఉద్యోగాల్లో వయో సడలింపు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.