మీకు రోజు షేవింగ్ చేసుకునే అల‌వాటు ఉందా.. ఐతే మీకోస‌మే..!

Sambasiva Rao:

===============

ప్రస్తుత రోజుల్లో నున్నగా గ‌డ్డం చేసుకునే వారికంటే పెంచుకునే వారే ఎక్కువ‌గా ఉన్నారు. గ‌డ్డం పెంచ‌డ‌మే కాదు అంద‌రిలో  విభిన్నంగా క‌నిపించాల‌నే దానిని షేప్స్ తీస్తున్నారు. అయితే కొంత మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్‌గా షేవింగ్ చేసుకొని వెళ్తారు. మిల‌ట‌రీలో ప‌నిచేసే వాళ్లకి రెగ్యుల‌ర్ షేవింగ్ త‌ప్ప‌నిస‌రి. మ‌రి కొంద‌రైతే  త‌ర‌చూ షేవింగ్ చేసుకోవ‌డం అల‌వాటు.  ఎవరిష్టం వాళ్లది. అయితే రోజూ గ‌డ్డం తీసుకోవ‌డం వల్ల కొన్ని లాభాలున్నాయి. ఏమిటో తెలుసుకుందా..

షేవింగ్‌కు సంబంధించిన ఒక అధ్యయ‌నం ప్రకారం.. ఉద‌యం షేవింగ్ చేసుకునే వారు ఉత్సాహంగా ఉంటారంట‌.గడ్డంలో ఎన్నో రకాల బ్యాక్టీరియా కొలువై ఉంటుంది. ఇది చర్మాన్ని పాడుచేస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు ఏర్పతాయి. షేవింగ్‌ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే జుట్టు శుభ్రపడుతుంది. అంతే కాదు నీట్ గా షేవ్ చేయ‌డంతో ఎంతో యంగ్ గా, అందంగా క‌నిపిస్తారు.బ‌య‌ట ప‌నుల మీద వెళ్లొచ్చే వాళ్ల ముఖం పై దుమ్ము ప‌డ‌డంతో బ్యాక్టీరియా, క్రీములు గ‌డ్డంలో అలాగే ఉంటాయి. ముఖంపై బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి గ‌డ్డం చేసుకుంటే బ్యాక్టీరియా తొలిగిపోతుంది.

రెగ్యుల‌ర్ షేవింగ్ వ‌ల్ల‌ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది.నున్నంగా గ‌డ్డం చేసుకోవ‌డానికి  ఉపయోగించే షేవింగ్‌ క్రీమ్, ప్రీషేవ్‌ ఆయిల్,  జెల్‌  లేదా బామ్‌ వంటివన్నీ మీ చర్మ పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి ఉదయాన్నే షేవ్‌ చేసుకోవడం వల్ల  పనులకు వెళ్లే వారు మరింత సామర్థ్యంతో పనిచేస్తారని కొన్ని పరిశోధనలలో తేలింది.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole