వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు: అమిత్ షా

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెల్లడించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కో-వ్యాక్సినేషన్  ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేస్తామని, దీని వలన ఎవరు పౌరసత్వం కోల్పోరని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో  ‘ప్రధాని వికాస్ అభివృద్ధి నమూనా.. సీఎం మమతా బెనర్జీ వినాష్ నమూనా ‘ మధ్య పోటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 294 స్థానాలకు 200 పైగా స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా జై శ్రీ రామ్ నినాదం అంటే ఒంటి కాలుమీద లేచే మమతా బెనర్జీ, ఎన్నికల తరువాత జై శ్రీరామ్ నినాదం చేస్తారని కేంద్ర హోంమంత్రి  చెప్పుకొచ్చారు.. అల్లుడి కోసం దీదీ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆయన పేర్కొన్నారు.