Telangana: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అటు గ్రూప్ 1 నిరసనకు మద్దతుగా .. ఇటు హిందు దేవాలయాలపై దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు రోడెక్కారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. జీవో 29 ను రద్దు చేయాలంటూ కేంద్రహొం శాఖ సహాయమంత్రి బండిసంజయ్ కుమార్ , గ్రూపు 1 అభ్యర్థులకు మద్దతుగా అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈక్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి తోడు హిందూ దేవాలయాల మీద దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు చేపట్టిన శాంతియుత ర్యాలీ రణరంగంగా మారింది.
కాగా కేంద్రహోంశాఖ సహయమంత్రి బండిసంజయ్ కుమార్ గ్రూపు 1 అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. గ్రూపు 1 అభ్యర్థులతో కలిసి అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు ర్యాలీగా నడిచివెళ్లారు. జీవో29 రద్దు చేయాలని, గ్రూపు 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని బండి డిమాండ్ చేశారు.ఆయన వెంట వేలాదిమంది నిరుద్యోగులు పోలీసుల వలయాన్ని చేధించుకుంటూ నడిచారు. అయితే పరిస్థితి చేయిదాటడంతో కేంద్రమంత్రిని పొలీసులు అదుపులోకితీసుకున్నారు.కార్యకర్తలు అడ్డుపడుతున్నప్పటికీ బలవంతంగా ఆయన కారులోకి ఎక్కించారు.సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఇక దేవాలయాల మీద దాడిని నిరసిస్తూ సికింద్రాబాద్ పరిధిలో హిందూ సంఘాలు చేపట్టిన శాంతియుత ర్యాలీ రణరంగంగా మారింది. శాంతియుతంగా ధర్నాచేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తకు దారి తీసింది.
ఈఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదిలా ఉంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు కుట్రలో భాగమేనని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఓట్ల కోసం శాంతికి విఘాతం కల్పించే వారిని ప్రోత్సహిస్తే..పాముకు పాలుకు పోసినట్లేనని హెచ్చరించారు. ఈవిషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేయకుండా దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.