బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి కాబోతుంది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హీరో రణ్ బీర్ కపూర్ తో అలియా వివాహం ఈఏడాది ఏప్రిల్ లో జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలియజేశారు.
ప్రెగ్నెన్సీ విషయాన్ని అలియా భట్.. ఆస్పత్రిలో స్కానింగ్ తీసిన ఫోటోలను ఇన్ స్టాలో పాపాయి రాబోతున్నాడు అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. ఈఫోటోలో ఆమె పక్కన రణ్ బీర్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో బెడ్ పై అలియా పడుకొని ఉండగా ఆమె పక్కన రన్ బీర్ కూర్చొని ఉన్నాడు. పక్కన ఉన్న కంప్యూటర్ స్రీన్ పై లవ్ సింబల్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ విషయాన్ని అలియా తెలియజేసింది.