కేంద్రమంత్రి అమిత్ షాతో మీడియా మొఘల్, బాద్ షా భేటి(ఫోటోస్)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మీడియా మొఘల్ రామోజీరావుతో భేటి సర్వత్రా చర్చనీయాంశమైంది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి..శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో తారక్ తో భేటి అయ్యారు. అంతకంటే ముందు రామోజీరావుతో ఆయన స్వగృహంలో కలిశారు.

అమిత్ షా, బాద్ షా భేటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు తెలిసింది.

రామోజీరావుతో భేటి అనంతరం అమిత్ షా ట్విట్ చేశారు. రామోజీరావు జీవిత ప్రయాణం అపూరమైందని.. మీడియాకు సంబంధించి లక్షల మందికి ఆయన జీవితం స్పూర్తిదాయకమైందిని కొనియాడారు.ఆయనను తన నివాసంలో కలిశానని అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

తారక్ తో భేటి అనంతరం అమిత్ షా ట్విట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. తెలుగు సినిమా తారకరత్నం జూనియర్‌ ఎన్టీఆర్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందంటూ అమిత్ షా ట్విట్ చేశారు.

ఇటీవల విడుదలై, ఘన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకు అమిత్‌ షా ముగ్ధుడయ్యారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకే షా కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని అంటున్నారు.