కామారెడ్డిలో మరో లవ్ జిహాద్ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మరో లవ్ జిహాద్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు మాయ మాటలతో.. హిందూ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని హిందు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్ధానిక సీఐ హామీ మేరకు ధర్నా విరమించారు.

ఇక వివరాల్లోకి వెళితే..బాన్సువాడ మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో షఫీ అనే యువకుడు ప్రయివేట్ అంబులెన్స్ నడుపుతున్నాడు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ హిందు యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. రెండు సంవత్సరాలుగా సహజీవనం చేశాడు.  తీరా పెళ్లి టాపిక్ తెచ్చే సరికి మొఖం చాటేశాడు.విషయం తెలిసిన హిందూ సంఘాల నాయకులు .. బాధిత యువతకి న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. అనంతరం పోలీసుల హామీతో ధర్నా విరమించారు.

 

ఇదిలా ఉంటే.. గతంలోనూ ఇలాంటి ఘటనలపై ఇదే ఆసుపత్రిలో సూపర్ డెండెంట్ కు పలు మార్లు ఫిర్యాదు చేశామన్నారు హిందూ సంఘాల నాయకులు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట ఉండాల్సిన ప్రవేటు అంబులెన్స్ లు.. ఆసుపత్రి ప్రాంగణంలో ఉండడం ఏంటని ప్రశ్నించారు.లవ్ జిహాద్ పేరుతో హిందు అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సూపర్డెంట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని.. ఇకపై ఇలాంటివి జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

 

Optimized by Optimole