నల్గొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రావు IPS

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి రామగుండం సి.పి గా బదిలీపై వెళ్ళారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం..జిల్లా ఎస్పీ కార్యాలయంలో అపూర్వ రావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు.. ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పంగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర రావు, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.